Home తాజా వార్తలు పారిశుద్ద్య కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

పారిశుద్ద్య కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

by V.Rajendernath

బీబీపేట్ జూలై 24 :- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ )గత 19 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంఘీభావం తెలిపారు .బీబీపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించారు .కార్మికులతో మమేకమై మాట్లాడారు .ఈ సందర్భంగా వారి సమస్యల గూర్చి మాట్లాడుతూ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభించడం తగదన్నారు .కరోనా కష్ట కాలంలో కార్మికుల ధైర్య సాహసాలు ఎప్పటికి మారువలేనివని చెబుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగుకి లక్షల , వేలల్లో జీతాలు ఉంటే గ్రామాన్ని కాపాడుతన్న కార్మికుల జీత భత్యాలు ఇంత దారుణంగా ఉంటాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారుఅనంతరం స్ధానిక మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్ మాట్లాడుతూ జి. ఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని , మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ,ఉద్యోగ భద్రత కల్పించాలని ,స్వీపర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు .కార్మికులు డప్పులతో వాయిద్యాలు చేసి నిరసన వ్యక్తం చేస్తుండగా తాను కూడా డప్పు తీసుకొని అనుసరించి వాయించి సంఘీభావం ప్రకటించారు.

You may also like

Leave a Comment