మంచిర్యాల, జులై 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): భారత విప్లవోద్యమ నిర్మాతలు దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి సంస్కరణ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప కార్యదర్శి రాముదాజ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నెల కమ్యూనిస్టు విప్లవకారులకు ప్రత్యేకమైన మాసం భారత విప్ల మోద్యోయ నిమ్మతలు ఎన్సిసి ఆర్ఐ ఎంఎల్ భారత విప్లవంలో అగ్రగన్యాలు దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమెల నాగిరెడ్డి బడుగు బలహీనుల విప్లవం కోసం అంకితభావంతో జీవితాంతం కృషి చేసి చలించారు. ఈ నెలలోనే ఇద్దరు 1917 టీఎన్ 1976 జూలై 28, డివి 1984 జూలై 12న అమరులయ్యారు. ఇద్దరు సాధించిన విప్లవ కృషిని గుర్తుచేసుకొని వాటి నుండి నేర్చుకొని తమ ముందున్న కర్తవ్యం కమ్యూనిటీ విప్లవకారులు పునరంకిత మవుతున్నారు. ఉమ్మడి జలబార్ జిల్లా వ్యాప్తంగా జన్నారం ఉట్నూర్ అదిలాబాద్ బెల్లంపల్లి గ్రామాల్లో ప్రజలు పోడు భూములకై హక్కులను సాధించుకోవడం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తిరుగులేని పోరాటం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈనెల 27 న సమయం మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ కమిటీ యాడ్ జై నూర్ అదిలాబాద్ జిల్లా లో జరిగే సభను అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కార్యదర్శి చిందం చంద్రమౌళి మంచిర్యాల జిల్లా కార్యదర్శి చిరంగుల ఎల్లయ్య మంచిర్యాల జిల్లా ఉప కార్యదర్శి వేముల నరసయ్య, మంచిర్యాల మహిళా సంఘం అధ్యక్షురాలు దేవరకొండ సంధ్య, మంచిర్యాల నాయకులు కనికారపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
భారత విప్లవోద్యమ నిర్మతల సంస్కరణ సభలు విజయవంతం చేయండి
29