Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

by V.Rajendernath


వేములపల్లి,జులై 24( తెలంగాణ ఎక్స్ ప్రెస్) రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం మండల కేంద్రంలోని అద్దంకి- నార్కెట్పల్లి రహదారిపై చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం ఏడుకొటల తండాకు చెందిన ధీరావత్ సూర్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై హైదరాబాదుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ వంతెన మీదకి చేరుకోగా అదే సమయంలో హైదరాబాదు వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సూర్య ను అంబులెన్స్ లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించినట్లు ఏఎస్ఐ వి నర్సింగా రావు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment