ఎల్లారెడ్డి, నవంబర్ 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్, మంగళవారం బిఆర్ఎస్ పార్టీనీ వీడి భర్త తో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల మదన్ మోహన్ రావు సమక్షంలో సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లో సాదరంగా ఆహ్వానించారు. ఎల్లారెడ్డి ఎంపిపి గా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపిపి పదవి బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేళ్ల కు పైగా ఉమ్మడి జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎంపిపి గా కొనసాగిన మాధవి గౌడ్ , మే 28 న నియోజకవర్గం లోని లింగంపేట్ మండల కేంద్రంలో బిఅర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్ష్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే తో సఖ్యతగా నే ఉంటూ వారం రోజుల్లో ఎన్నికలు వుండగానే బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ స్వంత గూటికి తన అనుచరులతో కలిసి చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఆరీఫ్, నాయకులు బొండ్ల సాయులు, ఈశ్వర్ గౌడ్, బాల్ రాజ్ గౌడ్, నగేష్ తదితరులు ఉన్నారు.