కామారెడ్డి, జూలై 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కోట్ల నిధులు ఉన్నా నిర్లక్యం కోరల్లో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
లక్షల రూపాయల జీతాలు తీసుకొని 2 గంటలు కూడా సరిగ్గా డ్యూటీ చేయటం లేదు
అన్ని సదుపాయాలు ఉన్నా కమిషన్ కోసం గర్భిణులను, ఇతర పేషంట్ లను కావాలని ప్రైవేట్ ఆసుపత్రికి పంపుతున్నారు
అవినీతికి కేరాఫ్ అడ్రస్ డి ఎమ్ అండ్ హెచ్ ఓ
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన కామారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
కామారెడ్డి ఏరియా ఆసుపత్రి బాన్సువాడ కి తరలించారు
హాస్పిటల్ డెవలప్మెట్ సొసైటీ
అదే ఆవరణలో వైద్య కళాశాల మంజూరు అయ్యిందన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ పరిస్థితిని వైద్య శాఖ మంత్రి ప్రత్యక్షంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. పైన కళాశాల కోసం భవనం కడితే కింద ఫ్లోర్ లో పెచ్చులు ఊడిపోతున్నాయన్నారు.
టీచింగ్ కళాశాల గైడ్ లైన్స్ ప్రకారం కొత్త కళాశాల నడపాలని కోరుకుంటున్నామన్నారు.
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి లో హెచ్ డి ఎస్ హాస్పిటల్ డెవలప్ మెంట్ కమిటీ సమావేశం ఇప్పటి వరకు సమావేశం జరిగిందా, ఆ వివరాలు మీడియాకు చెప్పారా అన్నారు. దేవుని పల్లి మాత శిశు రక్ష ఆసుపత్రి ని వైద్య కళాశాల కోసం ఇవ్వడం జరిగిందన్నారు.
హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మెన్ గా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ హెచ్ డీఎస్ సమావేశం పెట్టారా అనేది చెప్పాలన్నారు. కమిటీ డైట్, ఫార్మసి, క్లీనింగ్ వంటివి ఓపెన్ టెండర్ ద్వారా ఇవ్వాలి అలానే ఇస్తున్నారా, హెచ్ డీఎస్ ఎన్ని సార్లు మీటింగ్ పెట్టరు, మినిట్స్, డబ్బు ఖర్చులు, ఇతర వివరాలు అన్ని సుపరిండేట్ మీడియాకి తెలియజేయాలన్నారు.
ఆసుపత్రికి రోజు 1200 మంది ఒపి ఉంటుందన్నారు.
డాక్టర్లకు చూడటానికి సరియైన గదులు లేవు, రోగులు ఎవరిని కలవాలో తెలియదన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 64 మంది డాక్టర్ లు ఉన్నారు వీరు అందరూ ఉదయం 9 నుండి 4 వరకు పని చేయాలి. గర్భిణీలకు మూత్ర శాల సౌకర్యం లేదు
ఆసుపత్రికి నీటి సౌకర్యం లేదు ఒక్క బోర్ కూడా పని చేయటం లేదని, నర్స్ లు 100 మంది ఉన్నారు గత కొన్ని యేళ్లు అంతే సిబ్బందితో నడుస్తుందన్నారు.
ఆసుపత్రి లో సులబ్ కాంప్లెక్స్ కట్టి మూత్రం కు 3 రూపాయలు, మరుగు దొడ్డి కి 10 రూపాయలు తీసుకుంటున్నారు.
వైద్యులు 9 నుండి 4 వరకు చేయాల్సిన ఉద్యోగం 10 నుండి 12 వరకు మాత్రమే చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితి ఉన్నా రోగుల కోసం వైద్యులు రారు
మరి ఈ వ్యాధులకు ఎవరు ఇలా వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నారు.. పై అధికారులు ఏం చేస్తున్నారు. రేపటి నుండి డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది సమయం ప్రకారం తప్పని సరిగా ఉండాలి. మేం వస్తాము, చూస్తాము ప్రతి పక్ష పార్టీగా బీజేపీ నాయకులకు ఆ అధికారం మాకు ఉంది.
రాత్రి పూట డ్యూటీ డాక్టర్ లు ఉండరు, రాత్రి అత్యవసర పరిస్థితిలో వస్తె వారిని పైవేటు ఆసుపత్రి పంపి పైవెటు ఆసుపత్రి వద్ద కమిషన్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు కొత్తగా కామారెడ్డిలో ప్రైవెట్ ఆసుపత్రి కి అంబులెన్స్ ల ద్వారా పంపిస్తున్నారు.
డ్యూటీ డాక్టర్ ఎవరు అని డిస్ప్లే పెట్టరన్నారు. సిబ్బంది రోజు సంతకాలు పెడతారు కానీ డ్యూటీ లో ఉండరు. జీతాలు తీసుకుంటారన్నారు. నేను చేసిన ఆరోపణ అబద్దం అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో గల సిసి కెమెరా లో చుయించాలన్నారు. రోగులకు ఇచ్చే భోజనం వంట గది అధ్వాన్నంగా ఉంది. భోజనం కూడా తినే పరిస్థితిలో లేదు. నాణ్యత పూర్తిగా కరువు అయ్యింది. సెక్యూరిటీ రాజకీయ నాయకుల మనుషులు చూస్తున్నారు. శానిటేషన్ కూడా పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. అది కూడా ఒక ఉద్యోగి లక్ష్మణ్ కనుసన్నల్లో నడుస్తుంది.
శానిటేషన్, డైట్, సెక్యూరిటీ లలో మార్పులు జరిగి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. శ్రీనివాస్, రమాదేవి, శ్యామ్, నవీన్ కుమార్ వంటి వారు ప్రైవేటు ఆసుపత్రి నడిపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారిని. ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రి నుండి నేరుగా అపెక్స్ ఆసుపత్రి కి రోగులను పంపుతున్న అపెక్స్ ఓనర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నవీన్ కుమార్..
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రులు లక్ష్మణ్ కనుసన్నల్లో నడవాలసిందే అన్నారు. జిల్లాలో 200 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు కానీ అందుకు సరిపడా లేవన్నారు. డాక్టర్ నుండి వార్డు బాయ్ వరకు అందరూ పైవెట్ ఆసుపత్రికి రిఫర్ చేసే వారే అన్నారు. అవరం లేకున్నా స్కాన్ కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్ కి పంపుతున్నారు. ఒక్కో స్కానింగ్ మీద కమిషన్ తీసుకుంటున్నారు.
డెలివరీ కి వచ్చిన వారిని కావాలని ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నారు. సిసి కెమెరాలు కావాలని పని చేయకుండా చేస్తున్నారన్నారు.
పాత కలెక్టరేట్ ఆవరణలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి, జిల్లా ఆసుపత్రి నీ యథాతతంగా ఉండాలన్నారు. కలెక్టరేట్ లు, ఎస్పీ కార్యాలయం ఇలా అనేక భవనాలు ఆగమేఘాల మీద కట్టిన ప్రభుత్వం ఆసుపత్రి కట్టడానికి ఎందుకు మనసు రావడం లేదన్నారు.
డీఎంఅండ్ హెచ్ ఓ పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. నావి తప్పుడు ఆరోపణలు అయితే మిరు సమయం చెప్పండి నేను సాక్షాలతో సహా వస్తా అని సవాల్ చేశారు.