చేగుంట జూలై22:—(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
చేగుంట వైపు వస్తున్న కారును కంటైనర్ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి కారులోన ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు గ్రామ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్సింగి సొసైటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మాజీ మండల శాఖ అధ్యక్షులు కేతావత్ తోర్య నాయక్ (45) శనివారం ఉదయం తన కారులో చేగుంట వైపు వస్తున్నాడు. వల్లూరు గ్రామ శివారులో కారు టైరు పంచర్ కావడంతో డివైడర్ పైకి ఎక్కగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టడంతో కారు చెట్టుకు గుద్దుకొని ఆగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న తోర్య నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఇరుక్కున్న మృతహాన్ని బయటకు తీయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. నార్సింగి, చేగుంట మండలలో బీఆర్ఎస్ పార్టీ మంచి నాయకున్ని కోల్పోయిందని పలువురు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి అంత్యక్రియలో పాల్గొని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు అదేవిధంగా చేగుంట మండల జడ్పిటిసి ఎంపీపీ శ్రీనివాస్‌లు, సంతాపం తెలిపి అంత్యక్రియలో పాల్గొన్నారు ఉమ్మడి మండల టిఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని తౌరియా నాయక్ అంత్యక్రియలో పాల్గొన్నారు