నిజాంసాగర్ జూలై 22,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామంలోని 248,249 పోలింగ్ కేంద్రాలను శనివారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) యం.మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కొత్తగా వచ్చి మొట్టమొదటిసారిగా నిజాం సాగర్ మండలానికి పోలింగ్ కేంద్రాల తనిఖీ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు. వీటికి సంబంధించిన వివరాలను స్థానిక తహసీల్దార్ నారాయణ కు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ కు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట గీర్దావార్ జంగిటి చంద్రబాను, బిఎల్ ఓ లు ఉన్నారు.