విజయనగరం, జూలై 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్ )విజయనగరం జిల్లా నూతన కార్యవర్గం నియామకం అయిన సందర్భంగా శనివారం జాప్ నూతన కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికా పాటిల్ ని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ గురుంచి వివరాలు తెలియజేసారు. నూతన కమిటీ కి జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులు సమస్యలు ఏమైనా ఉంటే తనకి తెలియజేయలి అని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం అని తెలిపారు. పోలీస్ శాఖ,జర్నలిస్ట్ లు కలిసి ముందు అడుగు వెయ్యాలి అని,జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు.యూనియన్ ద్వారా మంచి కార్యక్రమలు నిర్వహించాలి అని, వాటికి తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు అవనపు సత్యనారాయణ,
గోపాల్ వర్మ జె.వి.అర్,జిల్లా అధ్యక్షుడు మానపురం రవిచంద్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి దినపల్లి పరుశురాం, ఉపాధ్యక్షులు అల్లాడ రమణ కార్యనిర్వాహక కార్యదర్శి వి.గౌరి శంకర్, కార్యదర్శి లు
ఎం.హేమంత్ కుమార్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.