ఎల్లారెడ్డి, జులై 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రాబోయే అసెంబ్లీ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తప్పులు లేని ఖచ్చితమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలి అని, నియోజక వర్గ స్థాయి శిక్షకులు నాయబ్ తహశీల్దార్ కె.రాజేశ్వర్ బిఎల్ఓ లకు సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో రెండవ స్పెషల్ సమ్మరి రివిజన్ 2023 లో భాగంగా, ఓటరు జాబితా తయారి పై బిఎల్ఓ లకి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు కె. రాజేశ్వర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు పూర్తి చేసి, తప్పులు లేని విధంగా ఓటరు జాబితా సిద్ధం చేయాలి అని సూచించారు. ఇందు కోసం బి ఎల్ ఒలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి సంబంధించిన విధులు, బాధ్యతలను వివరించారు. కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి సర్వేపై శిక్షణ అందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక గిర్థావర్ శ్రీనివాస్ రావు, సీనియర్ అసిస్టెంట్ వాణి, నియోజక వర్గ ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్ అన్న శివకుమార్, మండలానికి చెందిన 44 మంది బిఎల్ఓ లకు 4 గురు సూపర్వైజర్లు పాల్గొన్నారు.