బిచ్కుంద జూలై 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని ప్రజలు ఇంకా వర్షాలు పెద్దగా పడే సూచనలు ఉన్నాయని, ముఖంగా ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద లేదా రైతులు విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద ఉండకూడదని ఆయన ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద చిన్న పిల్లలు కూడా బయట ఆడుకోవడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు గమనించాలని వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనాలు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుందని ముఖ్యంగా ఉరుములు మెరుపులు వచ్చే క్రమంలో రైతులు చెట్ల కింద నిల్చవద్దని ఎమ్మెల్యే సూచించారు. మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థాయి ప్రజలు సైతం ఎవరు చెరువులు కుంటల వద్దకు వెళ్లరాదని లోతు తక్కువగా ఉందని భావించి నీటి ప్రభావం లోకి దిగరాదని ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఏమైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే పోలీస్ శాఖకు లేదా రెవెన్యూ శాఖకు అగ్ని బాబా శాఖలకు సమాచార వెంబడి అందించాలని ఆయన ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు.