నిర్మల్ జూన్21 జిల్లా ప్రతినిధి (తెలంగాణ ఎక్స్ ప్రెస్స్); భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేస్తుందని చైర్మన్ రాజేష్ బాబు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కొత్త పాలక వర్గం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి అభివృద్ధి ప్రతిపాదనలు పంపామన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో మార్కెట్ కమిటికి రూ. 2.30కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రూ. కోటితో కాటన్ మార్కెట్ యార్డులో ఒక షాపింగ్ కాంప్లెక్స్, రూ. 1.30కోట్లతో కుభీర్ ఎక్స్ రోడ్డు మార్గంలోని యార్డులో మరో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు చేపడుతామని వెల్లడించారు. మున్ముందు మార్కెట్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని చెప్పారు. ఈ నిధుల విడుదల కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో వైస్ చైర్మన్ జేకే పటేల్, డైరెక్టర్ రాము, సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులున్నారు.
భైంసా మార్కెట్కు రూ. 2.30కోట్లుఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు
28