Home తాజా వార్తలు అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

by V.Rajendernath

అడవిదేవులపల్లి ఆగస్టు 15 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

స్థానిక మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం నందు ఇన్చార్జి తహసిల్దార్ వై రఘు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. తదనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలయిందని, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారని, ఈ సందర్భంగా వారు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు, పోలీస్ స్టేషన్ నందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, అంగన్వాడి కేంద్రాల నందు, ప్రాథమికోన్నత పాఠశాలనందు, కస్తూరిబా బాలికల పాఠశాలనందు, గ్రంథాలయంనందు, గ్రామపంచాయతీలు నందు, వివిధ వాడల్లో, ఆఫీసులలో మూడు రంగుల జాతీయ పతాకం రెపరెపలాడింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, జడ్పిటిసి కుర్ర సేవ్య నాయక్, ఎంపీడీవో మసూద్ షరీఫ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఠాకూర్ రామకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment