Home తాజా వార్తలు బతుకమ్మకుంట కాలనీ దారిని మూసివేయడం అన్యాయం

బతుకమ్మకుంట కాలనీ దారిని మూసివేయడం అన్యాయం

by V.Rajendernath


జనగామ జులై 20 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట దుర్గానగర్ కాలనీకి వెళ్లే దారిని ఎండోమెంట్ అధికారులు మూసివేయడం అన్యాయం అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుండి ఆ దారి గుండా నగరవాసులు బతుకమ్మకుంటకు వెళ్తున్నారు. అక్కడ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడుకుంటారని, అంతేగాక ప్రతినిత్యం ఉదయం నగర ప్రజలు మార్నింగ్ వాకింగ్ కు వెళుతుంటారు .అట్టి దారిని ఏకపక్షంగా ఎవరి ప్రోద్బలంతో దేవాదాయ శాఖ వారు రోడ్డును మూసివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కబ్జారాయుల్ల కళ్ళు ఈ కాలనీ పై పడటం వల్లనే అన్యాయంగా దారిని మూసివేశారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు స్పందించి ఈ దారిని పునరుద్ధరించాలని కోరుతున్నా అని అన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు మేలు చేయాలి కానీ, ఎప్పటి నుండో ఉన్నదారిని మూసివేయడం వారి యొక్క అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. అధికారులు స్పందించకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇక్కడి భూకబ్జా దళారులు కాలనీలను సైతం కబ్జా చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనబడుతుంది దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

You may also like

Leave a Comment