న్యూడిల్లీ, జూలై 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) వార్తా పత్రికలు, న్యూన్ ఏజెన్సీలు, టి.వి. ఛానెల్లల్లో జర్నలిస్టుల అక్రమ తొలగింపులకు నిరసనగా ఆగష్టు 9న పార్లమెంటు భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించునున్నట్లు కాన్స్డ్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ & న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు, ఎన్ యూ జె(ఐ)చైర్మెన్ రాస్ బిహారి, ప్రధానకార్యదర్శి ఎమ్.ఎస్. యాదవ్ ప్రకటించారు. ఉ ద్యోగాల నుండి తొలగించిన వర్కింగ్ జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని తిరిగి విధులలోకి తీసుకోవాలనీ, వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్‌ను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలనే డిమాండ్ లతో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి వినతి పత్రాలు సమర్పించినున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా వార్తాపత్రికలు, న్యూస్ చానెల్లు, యాజమాన్యాలు, జర్నలిస్టులను, నాన్ జర్నలిస్టులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా కాలంలో నష్టాల సాకుతో నష్టపరిహారం లేకుండా. లక్షలాదిమంది ఉద్యోగులును మీడియా సంస్థలనుండి తొలగించారన్నారు. అలాగే మీడియా ప్రతినిధుల ఇతర సమస్యల డిమాండ్ల పత్రం ఉంటాయని వారు తెలిపారు. నిరసన ప్రదర్శనలో ఇండియన్ జర్నలిస్ట్ (ఐ.జె.యు) అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి- ఐలవీందర్ సింగ్, జమ్ము, ఎన్.యూ.జె. (ఐ) ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తివారి, ఇండియన్ ఫెడరేషన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధానకార్యదర్శి పరమానంద పాండే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పి.టి.ఐ. ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు భువన్ చౌబే యు.ఎన్.ఐ వర్కర్స్ ఫెడేషన్ ప్రధానకార్యదర్శి ఎమ్. ఎమ్. జోషి ఆల్ ఇండియా న్యూస్ పేపర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యదర్శి సి.కె. నాయుడు దిట్రిబ్యూన్ ఎంప్లాయిస్ యూనియన్ చండీగడ్ అధ్యక్షులు అనీల్ గుప్తాలతో పాటు వేలాది మంది. జర్నలిస్టులు పాల్గొంటారన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వార్తా పత్రికలు, ఛానల్లలో ఆర్ధిక సంక్షోభం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామున్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు ముందు దేశంలోనే వివిధ రాష్ట్రాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఆగష్టు 9వ పార్లమెంటు ముందు జర్నలిస్టుల నిరసనసిఎన్ పిస్ఎఇఓ అధ్యక్షులు రాస్ బిహారి
34