Home తాజా వార్తలు కనీసవేతనాలఅమలుకై కార్మికగర్జన

కనీసవేతనాలఅమలుకై కార్మికగర్జన

by V.Rajendernath

కామారెడ్డి, జూలై 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు డివిజన్ కమిటి ఆధ్వర్యంలో కార్మిక గర్జన వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ ఎఫ్ టి యు డివిజన్ కార్యదర్శి బాలరాజు, సహాయ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ,
కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ & వర్కర్స్ కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ఆరోగ్య, ఉద్యోగ భద్రత లేదన్నారు. కనీస వేతనాలు అమలు కాక, శ్రమదోపిడికి గురవుతున్నారన్నారు. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.60 కూడా వీరికి అమలు కావడం లేదన్నారు. పని భారం పెరిగినా ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన కేజీబీవీల్లో పనిభారం మరింత తీవ్రంగా ఉందన్నారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేజీబీవీల్లో పనిచేసిన సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలన్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన కేజీబీవీల్లో కుక్, స్వీపర్, అటెండర్, స్కావేంజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కంప్యూటర్, ఒకేషనల్ ట్రైనర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏ.ఎన్.ఎంల నైట్ డ్యూటీలను 03 రోజుల నుండి ఒక రోజుకు తగ్గించాలన్నారు.
అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలన్నారు. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనలో భాగంగా ఆగస్టు 4న హైదరాబాదులో కార్మిక గర్జన నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు శ్రీనివాస్, నారాయణ, సంతోష్, పీ డి ఎస్ యు జిల్లా అద్యక్షులు సురేష్ కార్యదర్శి అనీల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment