Home తాజా వార్తలు ఓటర్ల జాబితా నమోదుపై శిక్షణ : 18 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి :

ఓటర్ల జాబితా నమోదుపై శిక్షణ : 18 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి :

by V.Rajendernath

మిర్యాలగూడ ఆర్డీవో బి. చెన్నయ్య

మిర్యాలగూడ జులై 19 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు, బిఎల్ఓ, ఏపిపి, తదితర విషయాలపై బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ కు శిక్షణ కార్యక్రమం బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది.ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని మిర్యాలగూడ ఆర్డీవో, వీఆర్వో బి చెన్నయ్య కోరారు. ఓటర్ల నమోదు పై విఆర్ఓ శిక్షణ తరగతుల ఉద్దేశించి ఆర్డీవో చెన్నయ్య మాట్లాడుతూ అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అందుకే స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్-2) ఏర్పాటు చేసి బిఎల్ఓ లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణఇప్పించడంజరుగుతుందన్నారు. ప్రతి బిఎల్వో మీ ప్రాంతంలోఉన్నఅన్నివిషయాలపైసమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫామ్ 6,7,8 లకు సంబంధించిన ఓటర్ల నమోదు పై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని ఓటర్ల జాబితాను నమోదు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ తహసిల్దార్ ఎం అనిల్ కుమార్, రెవిన్యూ డివిజన్ కార్యాలయ సిబ్బంది కల్పన, జానీ షరీఫ్, సందీప్, సత్యనారాయణ, జమాల్ , శ్యాంసుందర్, ఎస్ఎల్ఎంటి బాలు, డిఎల్ఎంటిలు గుడిపాటి కోటయ్య, అంబటి శ్రీను, రాజు, రామచంద్రు, సైదులు, జనార్ధన్, సైదిరెడ్డి, వెంకటరెడ్డి, సూపర్వైజర్లు, బిఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment