39
మక్తల్ మండల అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో
- ఉపాధ్యాయులందరూ తెలంగాణ సాధన పోరాట స్ఫూర్తిగా ముక్తకంఠంతో పోరాటం చేస్తే సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి మక్తల్.జులై.19:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) :రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దశల వారి పోరాటంలో భాగంగా జులై 18 నుండి 22 వరకు సంతకాల సేకరణ ఆరంభించింది. సంతకాల సేకరణలో భాగంగా తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున,
మండల గౌరవ అధ్యక్షులు భీంరెడ్డి, మక్తల్ మండల అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో మండలంలోని అందరూ ఉపాధ్యాయులను కలిసి సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఉద్యమ జాగరణ చేపడుతున్నది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తెలంగాణ సాధన పోరాట స్ఫూర్తిగా ముక్తకంఠంతో పోరాటం చేస్తే సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయని సూచించారు.
సమస్యల సాధనకు ఇదే అసలైన సమయమని ఉపాధ్యాయులందరూ ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఇప్పుడు కాకపోతే సమస్యలు ఇంకెప్పుడు పరిష్కారం కావని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అనిల్ గౌడ్, రఘువీర్ నామాజీ, వెంకట వరలక్ష్మి, దత్తు రావు,మహిళా ఉపాధ్యాక్షులు శిరీష,మండల ప్రధాన కార్యదర్శి రాకేష్,మండల సమన్వయకర్తలు నర్సిరెడ్డి ,వెంకట్ రాములు , కోశాధికారి రవీందర్ రెడ్డి ,కాంప్లెక్స్ కన్వీనర్ జగదీష్, సహకార్యధర్షులు రామాంజనేయులు, సురేష్,ప్రహల్లాధ్,ఆంజనేయులు, పాల్గొన్నారు.
.