Home తాజా వార్తలు గజ్వేల్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా బి. బన్సిలాల్,

గజ్వేల్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా బి. బన్సిలాల్,

by V.Rajendernath

జగదేవపూర్ : 19 (తెలంగాణ ఎక్స్ప్రెస్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డిఓగా నూతనంగా బాద్యతలు స్వీకరించిన బి. బన్సీలాల్ బుధవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ను మార్యదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఇదివరకు ఆర్డీఓ గా పనిచేసిన విజేందర్ రెడ్డి ప్రమోషన్ పై వెళ్లడంతో హన్మకొండ తహసీల్దార్ గా పనిచేసిన బి. బన్సీలాల్ ప్రమోషన్ పై గజ్వేల్ ఆర్డీఓగా బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అందరు అధికారులతో సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నూతన ఆర్డీఓ కు చూచించారు.

You may also like

Leave a Comment