జిల్లా క్రీడల అధికారిగా ఎన్నికైన వెంకటేష్ శెట్టిని ఘనంగా సన్మానించిన
మక్తల్.జూలై .19:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో జిల్లా క్రీడాల అధికారిగా ఎన్నికైన వెంకటేష్ శెట్టి ని జ్ఞాపిక ను అందించి ఘనంగా సన్మానించిన. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో జరిగే క్రీడలకు తన వంతు సాయం సహకారం అందిస్తానని గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో రాణించేందుకు, పి.ఈ.టి.లు కృషి చేయాలని అన్నారు. వెంకటేష్ శెట్టి ని జిల్లా సైక్లింగ్ షూటింగ్ బాల్ , టాగ్ ఆఫ్ వార్, అసోసియేషన్ అధ్యక్షుడు తన్సింగ్ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ పిఈటి గోపాలం, పిఈటిలు రూప, సౌమ్య ,మీనా కుమారి, విష్ణువర్ధన్ రెడ్డి, అమ్రేష్ ,రమేష్ కుమారు,లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి రుద్రసందం రామలింగం తదితరులు పాల్గొన్నారు.