Home తాజా వార్తలు 24 గంటల వ్యవసాయ కరెంటు ఎక్కడ సరఫరా అవుతుందో ఎమ్మెల్యే తెలపాలి…ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్…

24 గంటల వ్యవసాయ కరెంటు ఎక్కడ సరఫరా అవుతుందో ఎమ్మెల్యే తెలపాలి…ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్…

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జులై 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 24 గంటల వ్యవసాయ కరెంటు ఎక్కడ సరఫరా అవుతోందో ఎమ్మెల్యే తెలపాలని, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సుభాష్ రెడ్డి
సూచనతో, మండలంలోని భిక్కనూరు గ్రామ సబ్ స్టేషన్ వద్దకు మండల కాంగ్రెస్ నాయకులు వెళ్లి పరిశీలిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ మంగళవారం ఎమ్మెల్యే సురేందర్ పరమల్ల గ్రామంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నా మని అన్నారు. ఇక్కడ చూస్తే 24 గంటలు కాదు కదా కనీసం 12 గంటలు కూడా సరైన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లేదని, అదే విధంగా మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై మాట్లాడి నప్పటి నుండి సబ్ స్టేషన్ లో ఉండే లాగ్ బుక్కులను కూడా మాయం చేసి, కేవలం ఒక ఖాళీ లాగ్ బుక్ లో మెయింటైన్ చేస్తున్నారు. మీరు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తే ఎందుకు భయపడు తూ సబ్ స్టేషన్ లో ఉన్న లాగ్ బుక్కులను మాయం చేస్తున్నారు అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సురేందర్ దమ్ముంటే నువ్వు ఒక సబ్ స్టేషన్ ఎంచుకో అక్కడికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి వస్తాం… ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఎక్కడ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారో చర్చకు సిద్ధమై, సవాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, బిక్కనూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, నాయకులు సుఖేందర్ రెడ్డి, సాయిరెడ్డి, తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment