ఎల్లారెడ్డి, జులై 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఇంచార్జీ (ఎఫ్ఎసి) ఎంపీడీఓ రవీందర్ ను గా నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిడిఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరిం టెండెంట్ పి. రవీందర్ ను అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులను జిల్లాపరిషత్ సిఈఓ సాయగౌడ్ జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు విధులు నిర్వహించిన ఎంపీడీఓ కె.నారాయణ గుండె పోటుతో మంగళవారం తెల్లవారు జామున హఠాన్మణం చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో మండల ప్రజలకు, పంచాయతీ కార్యదర్శులకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.