Home తాజా వార్తలు ముగిసిన ఆర్జీయూకేటీ రెండో విడత కౌన్సిలింగ్.

ముగిసిన ఆర్జీయూకేటీ రెండో విడత కౌన్సిలింగ్.

by V.Rajendernath

బాసర. జూలై. 19 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

బాసర ఆర్జీయూకేటీ ఉపకులపతి ప్రొఫెసర్ వెంకటరమణ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో 6 సంవత్సరాల సమీకృత విధానం(PUC+B.Tech)లో విద్యనభ్యసించుటకు PUC ప్రథమ సంవత్సర విద్యార్థుల ప్రవేశాలకు ఆర్జీయూకేటిలో ప్రశాంతంగా రెండో విడత కౌన్సిలింగ్ ముగిసింది. క్యాంపస్ ప్రాంగణంలోని స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ భవనంలో గల ఆడిటోరియంలో విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 148 సీట్లకు గాను 130 విద్యార్థులు హాజరు కాగా 18 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కాగా రెండో విడత కౌన్సిలింగ్ 1 నుంచి 148 వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ పర్యవేక్షించారు. చింతాకుల రేఖ, కర్నాల్ పల్లి ,చేగుంట, మెదక్ జిల్లా నివాసి అయిన విద్యార్థినికి ద్రువీకరణ పత్రాన్ని అందజేసి రెండో విడత కౌన్సిలింగ్ ను ప్రారంభించారు. నూతన విద్యార్థులు ఆగస్టు ఒకటవ తేదీ నాడు క్యాంపస్కు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. రెండవ తేదీ నుంచి 5వ తేదీ వరకు అవగాహన కార్యక్రమం( ఓరియంటేషన్ ప్రోగ్రాం) ఉంటుందని, ఏడవ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, కోకోఆర్డినేటర్లు డాక్టర్ పావని, డాక్టర్ దత్తు, సభ్యులు డాక్టర్ కుమార్ రాగుల, డాక్టర్ కుంట్ల శ్రీకాంత్, అడ్మిషన్స్ కమిటీ సభ్యులు హరికృష్ణ, సునీత, కృష్ణ, సంతోష్ రెడ్డి, అధ్యాపకులు ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుసి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment