నిజాంసాగర్ ఆగస్టు 11,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దపేదర్ రాజు చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ పోస్ట్ మాస్టర్ లింగుగొండ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న శుభ సందర్బంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ బిపిఎం రఘువీర్, సింగల్ విండో చైర్మన్ వాజీద్ అలీ, నాయకులు కాశయ్య, మహేందర్,మాలిస్ రాజు, ప్రముఖ వ్యాపారవేత్త
జక్సాని శ్రీనివాస్ గుప్తా, గ్రామస్థులు పాల్గొన్నారు.