Home తాజా వార్తలు సోనియమ్మ జన్మదిన కానుకగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు….ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం…ఎల్లారెడ్డిలో భారీ మెజార్టీతో మదన్ మోహన్ గెలుపు….- మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ జట్టి కుసుమ కుమార్

సోనియమ్మ జన్మదిన కానుకగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు….ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం…ఎల్లారెడ్డిలో భారీ మెజార్టీతో మదన్ మోహన్ గెలుపు….- మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ జట్టి కుసుమ కుమార్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, నవంబర్ 14, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 న కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ జన్మ దిన కానుకగా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని , ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ జట్టి కుసుమ కుమార్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రజలు దొరల తెలంగాణ కావాలో ప్రజల తెలంగాణ కావాలో తెల్చు కోవాలన్నారు. డిసెంబర్ 9 న సోనియమ్మ జన్మదిన కానుకగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడవద్దు ధైర్యంగా పనిచేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని, ఇందులో ఎల్లారెడ్డి అసెంబ్లీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఇంటింటికి అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల పాలనను ప్రజలకు ఇచ్చిన హామీలను విమర్శించి నియంత కుటుంబ పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి లక్ష ఉద్యోగుల భర్తీ దళిత ముఖ్యమంత్రి ఇలా అనేక హామీలను ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషితో పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి తేవాలని తెలిపారు. మొదటి సారిగా వచ్చిన అబ్జర్వర్ కు పార్టీ కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గోపాలం విద్యాసాగర్, అన్య సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నాగం గోపికృష్ణ, కురుమ సాయిబాబా, మంచిర్యాల విద్యాసాగర్, ఆకుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment