Home తాజా వార్తలు కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ తో ఏఐసిసి కార్యదర్శి చర్చలు

కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ తో ఏఐసిసి కార్యదర్శి చర్చలు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, నవంబర్ 14:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి సెగ్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాంధారి మాజీ యంపిపి ఆకుల శ్రీనివాస్ ను మంగళవారం ఎఐసిసి సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి సిడి మయప్పన్ కలుసుకొని చర్చలు ప్రారంభించారు. గత కొంత కాలంగా పార్టీలో శ్రీనివాస్ ను పట్టించుకోవడం లేదని పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో ఎన్నికల సమయంలో ఆయన దూరంగా ఉంటే నష్టమని భావించి ఆయన్ని కలిసి చర్చలు జరిపారు. చర్చల అంశం ఇంకా తెలియరాలేదు.

You may also like

Leave a Comment