Home తాజా వార్తలు మోదిని దూషించడం నైతిక హక్కు లేదు పేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్

మోదిని దూషించడం నైతిక హక్కు లేదు పేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్

by V.Rajendernath

. ఊట్కూర్ జులై 5 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని దూషించడం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నైతిక హక్కు కూడా లేదని నారాయణపేట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ దగ్గర బిజెపి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీని దూషించడం సరైంది కాదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ గారిని క్షమాపణ కోరుతూ తమ దూషించిన మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఎంపీటీసీ హనుమంతు మండలంలో జింకల బెదడా ఎక్కువ కావడం పంట పొలాలు నష్టం వాటిల్లుతుందని వాటిని నివారించాలని ఎమ్మెల్యేని కోరగా ఎమ్మెల్యే సమాధానం ఇవ్వకుండా మోడీపై విరుచుకుపడి దురుసుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్ప మండల అభివృద్ధి కోసం ఎంపీటీసీలు ఉన్నామని మండల అభివృద్ధి కొరకు ప్రజలు ఎన్నుకున్నారని వారి సమస్యలు తీర్చడమే తమ దేమని వారన్నారు. నేడు ప్రధానమంత్రి మోదీ గారిని యావత్తు ప్రపంచం చూస్తుండడంతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు కెసిఆర్ కు వణుకు పుట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం లక్షల కోట్లు నిధులు విడుదల చేశారని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధిని మరిచి కెసిఆర్ తమ కుటుంబ అభివృద్ధి చేశారే తప్ప తెలంగాణ అభివృద్ధి పూర్తిగా అస్తవ్యక్తంగా మారిందని అన్నారు. నేడు నిరుద్యోగులు లక్షల మంది ఉన్న నేటికీ ఉద్యోగాలు లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అని అన్నారు. మోడీ ప్రపంచ నెల మూలలో భారతదేశము యొక్క ఔన్నత్యాని చాటారని వారు తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి క్షమాపణ కోరి తమ ఉనికిని చాటుకోవాలని ఆయన అన్నారు. మక్తల్ నుండి ఉట్కూరు వరకు ఉన్న బీటీ రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని వాన దారులు తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి ఎంపీటీసీ డి హనుమంతు, భరత్ కుమార్, తుల్జారాం, ఆశప్ప ,కృష్ణయ్య గౌడ్, భరత్, తోటప్ప, వెంకటేష్, మునప్ప, రఘువీర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్ రాస్తారోకో ఉద్దేశించి మాట్లాడుతున్న పేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్

You may also like

Leave a Comment