విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
కుల్కచర్ల, జూలై 5, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.
బుధవారం వికారాబాద్ జిల్లా చౌడాపుర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. వసతి గృహంలో బాత్రూమ్ లు సరిగా లేవని, ఇక్కడ ట్యూబ్ లైట్లు కూడా లేవని, కనీసం మౌలిక సదుపాయాలు లేని వసతి గృహంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహా సమస్యను పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల పట్ల అక్కడ పనిచేసే వర్కర్లు అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని మాకు మంచిగా పెట్టండి అంటే పనిచేసే వర్కర్లు తింటే తినండి లేకపోతే ఇది కూడా పెట్టము అని హాస్టల్ లో పనిచేసే వర్కర్లు విద్యార్థులను బెదిరిస్తున్నారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ విధంగా విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం ఆయా మండలాల అధ్యక్షులు సునీల్ నాయక్, అనిల్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, ఆయా మండలాల అధ్యక్షులు సునీల్ నాయక్, అనిల్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గణేష్ నాయక్, అరవింద్ నాయక్, శివరాం నాయక్ సంతోష్ నాయక్, శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు