Home Epaper పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ సెట్ వితరణ….

పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ సెట్ వితరణ….

by V.Rajendernath


పెద్ద కోడప్గల్ జూలై 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):- ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ప్రభుత్వ పాఠశాల ఖ్యాతిని పెంచాలని నిజామాబాద్ డిసిఇబి కార్యదర్శి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీతయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు బుధవారం నాడు ఆటల నిర్వహణ నిమిత్తం వాలీబాల్ సెట్, వాలీబాల్ లను స్థానిక సర్పంచ్ తిరుమలరెడ్డి చేతుల మీదుగా అందించారు. భవిష్యత్తులో అధిక సంఖ్య గల పాఠశాల లకు పలు విధాలైన మౌలిక వసతులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు సీతయ్య, ప్రథమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకాంత్, పిఈటీ ఫయాజ్, సీనియర్ ఉపాధ్యాయులు గంగా కిషన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment