ముధోల్ :జూలై05(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ). మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉప తహసీల్దార్ మహహ్మద్ అబ్దుల్ ఆసీఫ్ గుండెపోటుతో మృతి చెందారు. అద్దె ఇంట్లో ఉంటున్న డిప్యూటీ తహసీల్దార్ ఉదయం నిద్ర లెవలేక పోవడంతో గమనించిన ఇంటి యజమాని రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది సిబ్బంది పోలీసులకు ఏఎస్సై సుదర్శన బౌద్ద సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి,ఆర్డీవో రవికుమార్ మృతదేహం పరిశీలించి నివాళ్ళు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్నీ పలువురు రాజకీయ నాయకులు,అధికారులు సందర్శించి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. సౌమ్యుడుగా ఉంటూ ప్రజల మన్ననాలు పొందారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి తనవంతుగా సహయం చేసేవారు. ఆయన మృతితో సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక తహసిల్దార్ తుకారం, తానూర్ తహసీల్దార్ వెంకటరమణ, ఆర్ఐ నారాయణ ఉండి ఏర్పాట్లను పరిశీలించారు.
ముధోల్ డిప్యూటీ తహసీల్దార్ గుండెపోటుతో హఠాన్మరణం
30