హైదరాబాద్, నవంబర్ 5:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పై ఎవరు పోటీ చేస్తారని సస్పెన్సు వీడింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని కేసీఆర్ పై పోటీకి ఏఐసీసీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారనే ప్రచారంతో ఎటు తేలక పోవడంతో షబ్బీర్ అలీ న్యూట్రల్ గా ఉండిపోయిన విషయం పాఠకులకు విధితమే. అసలేం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం సీఎం కేసీఆర్ ను సరైన రీతిలో ఢీకొట్టే నేత అని రేవంత్ రెడ్డిని రంగంలోకి దించే చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ సమాచారం పార్టీ క్యాడరుకు చేరింది. దాదాపు వారం రోజులుగా రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి పోటీలో ఉంటానని తెలిసి చాప కింద నీరులా కామారెడ్డిలో తన పని తాను చేసుకపోవడం గమనార్హం. ఎలాగైనా కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా తన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. రెండు చోట్లా నుండి పోటీకి దిగనున్న రేవంత్ రెడ్డి ఈ నెల 6న కొడంగల్ లో, 8న కామారెడ్డిలో
నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
కామారెడ్డి నుండి కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డికి ఏఐసిసి అధిష్టానం గ్రీన్ సిగ్నల్
51