Home Epaper సంక్షేమ వసతి గృహ విద్యార్థుల మెస్ చార్జీల పెంపు జీవో ఏదీ

సంక్షేమ వసతి గృహ విద్యార్థుల మెస్ చార్జీల పెంపు జీవో ఏదీ

by V.Rajendernath

జాజుల లింగంగౌడ్

బంగారు తెలంగాణలో విద్యార్థుల అవస్థలు

మిర్యాలగూడ డివిజన్ జూన్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు మెస్ చార్జీలు 25% పెంచుతున్నామని మార్చి 1,2023న మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించి ఆమోదం తెలిపిందని,కానీ 5 నెలలు కావస్తున్న ఇంతవరకు జీవో ఊసే లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మిర్యాలగూడ లోని బీసీ బాలికల వసతి గృహంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు వసతి కల్పిస్తున్నామని,మెస్ చార్జీలు పెంచామని డబ్బాలు కొట్టుకోవడమే సరిపోయింది గాని ఇంతవరకు దాని గురించి మాట్లాడే దిక్కేలేదని అన్నారు సంక్షేమ వసతి గృహాలలో లక్షలాదిమంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పాఠశాలలు,కళాశాలల వసతి గృహాలు ప్రారంభమైనందున్న వెంటనే మెస్ చార్జీల పెంపు జీవో విడుదల చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లకు, కమిషన్లు ఇచ్చే వాటికైతే మాత్రం నిమిషాల మీద జీవోలు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అందరిని చిన్నచూపు చూస్తుందని ఆయన నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, ఊరిబండి శ్రీనివాస్ యాదవ్ , భూమిక వినీత, లావణ్య, శివాని, కావేరీ, దివ్య, మాధవి, కల్యాణి, సుమ, నాగమణి, యమున తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment