Home తాజా వార్తలు ప్రజల కష్టాలలో ఆదుకోని ఎమ్మెల్యే అవసరమా

ప్రజల కష్టాలలో ఆదుకోని ఎమ్మెల్యే అవసరమా

by V.Rajendernath

నాగిరెడ్డిపేట సమస్యలు వెక్కిరిస్తున్నాయి

ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు నిర్మిస్తా

అర్హులైన వారందరికీ
పోడు పట్టాలి ఇప్పిస్తా

ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ హామీ

కామారెడ్డి, నవంబర్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అవసరమా అని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ ప్రశ్నించారు. గురువారం నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో చేరికాల సభలో ఆయన మాట్లాడుతూ, నాగిరెడ్డి పేట సమస్యలు వెక్కిరిస్తున్నాయని ప్రజల రైతుల అన్ని వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. మండలంలో ఇళ్ల స్థలాలు లేక అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు .
బీడి కార్మికులకు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నాలుగున్నరలుగా ఎమ్మెల్యే సురేందర్ కుంభకర్ణ నిద్రపోయి ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు వస్తున్నాడని గ్రామాలలో రానివ్వకుండా నిలదీయాలని తరిమికొట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ పిలుపునిచ్చారు. మండలంలోని మెజారిటీ గ్రామాల్లో పోడు పట్టాలు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారందరికీ పోడు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పక్క ఇల్లు నిర్మిస్తానని మదన్మోహన్ హామీ ఇచ్చారు. కరోనాకాలంలో నాలుగున్నర ఏళ్ళు ప్రతి గ్రామoలో తిరిగి సొంత పైసలతో ఆక్సిజన్ ఇతర వైద్య సౌకర్యాలు కల్పించాలని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎనిమిది అంబులెన్స్ ఏర్పాటు చేసి నాగిరెడ్డిపేట లో ఒక అంబులెన్స్ ద్వారా ప్రజలకు వైద్య సౌకర్యాలు సకాలంలో అందేలా కృషి చేశానన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే సురేందర్ ను డిపాజిట్ రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ,
ప్రతి మహిళకు నెలకు 3 వేల రూపాయల ఆర్థిక సహాయం
ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు కౌలు రైతులకు ఆర్థిక సాయం, ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు పథకాలతో ప్రజలలో అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. ప్రజల ఆపద సమయాల్లో ఆదుకుంటానని భారీ మెజారిటీతో గెలిపించాలని మదన్మోహన్ ఆకాంక్షించారు.
చీడ పురుగు లాంటి
బీఆర్ఎస్ ను ,ఆమ్ముడుపోయిన
మోసగారి ఎమ్మెల్యే సురేందర్ లకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి కోరారు.
నాగిరెడ్డి పేట మండలంలో పేదలు బడుగు వర్గాలు
బీడి కార్మికులు ఇళ్ల స్థలాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారని వారి సమస్యలు పరిష్కరిస్తానని మదన్మోహన్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి 30 కోట్ల రూపాయలకు అధికార
బీయారెస్ పార్టీకి అమ్ముడుపోయిన సురేందర్ కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనేకమందికి పెన్షన్లు రాక యువతకు ఉద్యోగాలు లేక పేదలకు డబుల్ బెడ్రూమ్ లు లేక ఆవేదన చెందుతున్నారని గుర్తు చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు కేసీఆర్ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని రైతులు దిగులు చెందుతున్నారన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ గాక, పోడుపట్టాలు లేక రైతులు, ఇల్ల స్థలాల లభించక ఇతర
సమస్యల తో మండల ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారని మదన్మోహన్ గుర్తు చేశారు.
3 వేల ఓట్ల స్వల్ప తేడాతో జహీరాబాద్ ఎంపీగా ఓడిపోయానని ప్రజల కష్టాలలో ఆదుకున్న తనను గెలిపించాలని ప్రజల అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తానని మదన్మోహన్ హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అందుబాటులో లేక నిధులు రాక నాగిరెడ్డిపేట మండలం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ ఆరోపించారు.

భారీ సంఖ్యలో
మదన్ మోహన్ సమక్షంలో యువకుల చేరిక

నాగిరెడ్డిపేట మండలంలోని
గొలి లింగాల, ధర్మారెడ్డి, వాడి, వడల్ పర్తి
అక్కంపల్లి, చిన్న ఆత్మకూరు, తాండూరు గ్రామాల చెందిన టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు మదన్మోహన్ కాంగ్రెస్ ఆహ్వానించారు.

You may also like

Leave a Comment