కామారెడ్డి, నవంబర్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కిషన్ గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఫార్మ్ నాన్ లోకల్ కి ఇచ్చారని అతడు అందుబాటులో ఉండడని, ఆయన కార్యకర్తలపై నమ్మకం లేక దేవునిపై ఒట్టేయించుకోవడం లాంటివి చేస్తూ, పార్టీ కార్యకర్తల మనోభావాలని దెబ్బతీసాడని అందుకే తాను బిఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. గౌరవ గులాబీ అధినేత కేసిఆర్ నాయకత్వంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు. మండలంలోని యూత్ అందరు కలసి మళ్ళీ ఎమ్మెల్యే గా సురేందర్ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సురేందర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారని అందుకే వారి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషం అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
50