51
కామారెడ్డి, నవంబర్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)సదాశివానగర్ మండలం ధర్మారావుపేట గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మణ్, బీజేపీ నాయకులు రాజేందర్, విడీసీ మాజీ ఛైర్మన్ రాజు, రెడ్డి సంఘం అధ్యక్షులు సంజీవరెడ్డి వీరితో వివిధ పార్టీల నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ పార్టీలో చేరినవారికి మదన్ మోహన్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.