ఎల్లారెడ్డి, నవంబర్ 1,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
తపిసిసి ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బుధవారం ఢిల్లీలో బిజేపి జాతీయ అద్యక్షులు జెపి నడ్డ, తెలంగాణ రాష్ట్ర బిజేపి అద్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్వర్యంలో బిజేపి లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి సుభాష్ రెడ్డి కి బిజేపి కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి నమ్మిన అనుచరుడిగా ఉంటూ, నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఉండగా, కాంగ్రెస్ ఎలెక్షన్ కమిటీ రెండవ జాబితాలో మదన్ మోహన్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడం పట్ల తీవ్ర మనస్థాపం చెంది, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బోరున విలపించిన విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు. మదన్ మోహన్ ను ఒడించడమే ఏకైక లక్ష్యంగా, కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకు బిజేపి పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం లో బిజేపి జెండా ఎగురవేయడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, డికే అరుణ తదితరులు ఉన్నారు.