Home తాజా వార్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరిన బి ఎస్ పి నియోజకవర్గ అధ్యక్షులు ఆట్కరి బబ్లు….

బిఆర్ఎస్ పార్టీలో చేరిన బి ఎస్ పి నియోజకవర్గ అధ్యక్షులు ఆట్కరి బబ్లు….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, నవంబర్ 1,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణ శివారులోని ఎమ్మెల్యే ఫామ్ హౌస్ వద్ద, బుధవారం బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ఆట్కరి బబ్లు ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో, తన పార్టీ అనుచరులు, యువకులు మహిళలతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సురేందర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధికోసం దళిత బందు పథకం తీసుకొచ్చి దళితుల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని పట్టం కట్టాలని, ఇందు కోసం బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు భారీ మెజార్టీ తో గెలిపించాలని కో రారు. ఎన్నికల వేళ ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులు ఏవో హామీలు ఇచ్చి మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తారన్నారు. అభివృద్ది చేసే ప్రభుత్వానికే తిరిగి పట్టం కట్టాలని అన్నారు. బీఎస్పీ నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ఎల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు చిరంజీవి, కోశాధికారి గౌతమ్, నాగిరెడ్డి పెట్ మండల అధ్యక్షులు సుభాష్, తాడ్వాయి అధ్యక్షులు అనిల్, రాజు, విజయ్, మహేష్, చందు, శ్రీను తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, జడ్పిటిసి ఉష గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment