నిజాంసాగర్ ఆగస్టు 11,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
గ్రామాలలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తాలో ఏఎన్ఎంలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఏఎన్ఎం లను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఏఎన్ఎంల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ఏఎన్ఎంలు పుష్ప ,సులోచన, లక్ష్మి ,ఆర్ సుజాత, బి సునీత, సునీత, జి సుజాత, సత్యమ్మ లు పాల్గొన్నారు