Home తాజా వార్తలు చిన్న జీయర్ స్వామిజీకి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం… భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కె.వి.రమణారావు

చిన్న జీయర్ స్వామిజీకి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం… భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కె.వి.రమణారావు

by V.Rajendernath

హైదరాబాద్, అక్టోబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ముచ్చింతల్ లోగల చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో సమతా మూర్తి పేరిట ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామికి భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కె.వి.రమణారావు భారత్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసిన ధృవపత్రాన్ని శనివారం అందజేశారు. అహోబిల జీయర్ స్వామి, సత్యనారాయణ స్వామి, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు, నటుడు వేణు తదితరుల సమక్షంలో అందజేశారు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త సమాజంలో అంటరాని తనాన్ని , వివక్షతను రూపుమాపి, సమాజ సమానత్వం కోసం, కృషిచేసిన హిందు వేదాంతవేత్త, తత్వవేత్త
శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య జన్మించి 1000 సంవత్సరాలు గడచిన సందర్భంగా రామానుజ సహస్రాబ్ది సమరోహాన్ని నిర్వహించిన క్రమంలో వేదగురువు, ఉపదేశకుడు మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ, స్వీయ ఆరాధన సర్వ ఆదరణగా భావించి ఆచరిస్తున్న శ్రీ వైష్ణవ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో ఆయన పట్టుదల కృషితో సమాజం కోసం, సమానత్వం కోసం సమతా మూర్తి శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని 7000 వేల టన్నుల పంచలోహాలతో తయారు చేసిన 216అడుగుల ఎత్తుతో (శ్రీ రామానుజాచార్య విగ్రహం ఎత్తు 108 అడుగులు,భద్రాదేవి ఎత్తు 54 అడుగులు, త్రిదండం 135 అడుగులు మరియు పద్మపీఠం ఎత్తు 27 అడుగులు) ఉన్న విగ్రహాన్ని భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. భవిష్యత్ తరాలకు శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య కీర్తిని చాటేలా సమాజంలో సమానత్వం కొనసాగేలా పద్మశ్రీ మరియు పద్మభూషణ్
శ్రీ చిన్న జీయర్ స్వామిజీ చేసిన కృషిని అభినందిస్తూ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిన గొప్ప సమతమూర్తిగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేరుని భారత్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసిన ధ్రువపత్రాన్ని అందజేయడమైనది.
ఈ కార్యక్రమంలో కోటేశ్వరశర్మ,ఉమామహేశ్వరరావు, చలపతి రెడ్డి సుదర్శన్ గుప్త, లక్ష్మణ్, దయాకర్, లింగస్వామి, మణికంఠ, మురళి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment