బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
బీబీపీట్, అక్టోబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )మాజిక తెలంగాణ కోసం తొలి ,మలిదశ ఉద్యమంలో 1560 మంది బలిదానాలు చేసిన త్యాగాల తెలంగాణ
ఆధిపత్య కులాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీల దోపిడికి కేంద్రంగా మారిపోయిందని
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ విమర్శించారు.
ఈరోజు కామారెడ్డి బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు స్వగ్రామం బీబీపేట మండలం మల్కాపుర్ గ్రామంలో
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారన్నారు .
అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ 93 శాతం బిసి ,ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజన ప్రజలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బిఎల్ఎఫ్ అభ్యర్థులను అసెంబ్లీకి పంపడం ద్వారా మాత్రమే బహుజన ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు మాట్లాడుతూ విద్యార్థి జీవితం నుండే ప్రజాస్వామ్యం కోసం పౌరహక్కులు, కార్మిక,కర్షక, మహిళల సమస్యలపై ఉద్యమించిన చరిత్ర కలిగిన నన్ను కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తే చివరి శ్వాస విడిచే మరింత సేవా చేస్తానని హామీ ఇచ్చారు.
అంతకు ముందు గ్రామంలోగల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన తన తల్లితండ్రులకు నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీబీ పేట్ మండల కేంద్రంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభం. బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల కార్యాలయాన్ని బీబీ పేట్ మండల కేంద్రంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల ప్రతినిధి బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్దిరాములకు
లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఆధిపత్య కులాల పెట్టుబడిదారులకు మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటమని చరిత్రలో ఎప్పుడు కూడా సామాన్య ప్రజలే విజేతలయ్యారని ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలే మనకు ఆదర్శమని న్నారు.
ఈ కార్యక్రమంలో బిఎల్ ఎఫ్, రాష్ట్ర నాయకులు, యం, ఆంజనేయులు, వడ్ల, సాయి కృష్ణ, సిద్దిరాములు జీవిత బాగ స్వామీ, సిరిగాద సబిత,బిఎల్ ఎఫ్, నాయకులు, శ్రీహరి, నర్సిములు, కామారెడ్డి జిల్లా నాయకులు, సాయిబాబా, గంగాదర్ ,గంగా మణి, మల ,స్వప్న, స్తెనాజ్,మరళి,కిష్టమ్మ,దోమకొండ మండ కన్వీనర్,జి,రాజాశేఖర్, నాంపల్లి, బీబీ పేట్,మండల కన్వీనర్,చంద్ర కాంత్,బిక్కనూర్, మండల,కన్వీనర్ స్వామి,మల్కాపూర్, తుమ్మ శంకర్,మురళి,సిరిగాద భూమయ్య,భూలక్ష్మి,అనిత,కళవతి,,తూజాల్,పూర్,స్వామి, రాజేష్,తదితరులు పాల్గొన్నారు,