54
నిజాంసాగర్ అక్టోబర్ 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు గోర్గల్,ఆరేడ్,వెల్గనూర్,మల్లూర్,జక్కపూర్,అచ్చంపేట్ తదితర గ్రామాలలో శనివారం సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మను అందంగా అలంకరించి గ్రామ చవిడి వద్ద ఏర్పాటుచేసి బతుకమ్మ ఆటా ఆడారు.గోర్గల్ గ్రామంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామాలలోని చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.