Home తాజా వార్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

by V.Rajendernath

నాగిరెడ్డిపేట , అక్టోబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ సంఘ అధ్యక్షులు ఆత్మకూర్ బాబురావు తండ్రి దుర్గయ్య వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్ శనివారం బాబురావు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.తన కుటుంబానికి అండగా ఉంటానన్నారు.ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,జెడ్పిటిసి మనోహర్రెడ్డి,ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ హనుమంత్రెడ్డి,మాల్తుమ్మెద సొసైటీ మాజీ చైర్మన్ రాజిరెడ్డి,డైరెక్టర్ వంశీకృష్ణ గౌడ్,టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతం,మాసంపల్లి సర్పంచ్ చెట్టుకింద శ్రీనివాస్,పార్టీ సీనియర్ నాయకులు వంజరి కిరణ్ కుమార్,కంచన్పల్లి సంతోష్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment