Home తాజా వార్తలు వారంటి అయిపోయిన కాంగ్రెస్ గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరు…తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తే దేశం అనుసరిస్తుంది….కేసీఅర్ మాటిస్తే మడమ తిప్పడు….- ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

వారంటి అయిపోయిన కాంగ్రెస్ గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరు…తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తే దేశం అనుసరిస్తుంది….కేసీఅర్ మాటిస్తే మడమ తిప్పడు….- ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, అక్టోబర్ 21, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

వారంటి అయిపోయిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎల్లారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని అభివృద్ధిని కేవలం తొమ్మిదేళ్లలోనే సిఎం కెసిఆర్ చేసి చూపించారని, తెలంగాణలో వారంటీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కళ్ళు తెరిచి ఆరు నమ్మలేని గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టో ద్వారా ప్రజలను మరో మారు మోసం చేయాలని చూస్తుందని, కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. గతంలో బెంగాల్ రాష్ట్ర అభివృద్ధిని దేశం అనుసరిస్తే…నేడు దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని అభివృద్ధి సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టారని, వాటిని చూసి దేశంలో అనేక రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు కావాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏకైక సిఎం కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో రైతులు 45 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే , సిఎం కేసీఆర్ సర్కార్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలతో వరి పంట సాగు ద్వారా 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించి, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల ద్వారా వంద శాతం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిన ఘనత కేసీఆర్ సర్కార్ దే అని తెలిపారు. సిఎం కేసీఆర్ మాటిస్తే మడమ తిప్పడం అనేదే ఉండదని, ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎంగా కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించడం ఖాయం అని తెలిపారు. ఎల్లారెడ్డిలో సైతం బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే 93 లక్షల పైగా కుటుంబాలకు కేసిఆర్ బీమా పథకం కింద ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా కల్పించడం. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ఆసరా పెన్షన్ 2016 నుండి 5016 కు పెంచడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతుల బాధలు తెలిసిన కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల సాయం నుంచి విడతల వారీగా 16 వేలకు పెంచడం, అర్హులైన మహిళలకు నెలకు సౌభాగ్య పథకం కింద మూడు వేల రూపాయలు భృతి అందించడం చాలా సంతోషకరమన్నారు. పేద ప్రజలకు 400 కి గ్యాస్ సిలిండర్ ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఐదేళ్లలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందడం జరిగిం దన్నారు. ఈ సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పిటిసి ఉషా గౌడ్, నాగిరెడ్డిపేట్ జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు జెలంధర్ రెడ్డి, ఆదిమూలం సతీష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ్ కుమార్, కర్ణం అరవింద్ గౌడ్, సర్పంచ్ మామిడి దామోదర్ , పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment