Home తాజా వార్తలు వాహనాల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తే కేసులు నమోదు…- ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ శాఖీర్ అహ్మద్

వాహనాల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తే కేసులు నమోదు…- ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ శాఖీర్ అహ్మద్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, అక్టోబర్ 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

శాసన సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాల్లో అక్రమంగా మద్యం తరలిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతోందని, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ ఎండి.షాఖీర్ అహ్మద్ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణ శివారులోనీ మల్లయ్యపల్లి గ్రామ గేట్ సమీపంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ జలీలుద్దిన్, సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ షాకీర్ అహ్మద్ మాట్లాడుతూ, వాహనాల్లో ఇతర రాష్ట్రాల మధ్యంను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాగే గ్రామాలలోని కిరాణా షాపుల్లో అక్రమంగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయిస్తే అట్టి వారిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ఎండి. షాఖీర్ అహ్మద్, ఎక్సైజ్ ఎస్సై జలీలుద్దీన్ , సిబ్బంది గోపాల్, రవి, స్రవంతి, లావణ్య తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment