55
పిట్లం,అక్టోబర్20,(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మండల పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు.నవరాత్రుల్లో భాగంగా శనివారంనాడు పార్వతీదేవి ఆలయంలో గల అమ్మవారు శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం ప్రత్యేక అభిషేకాలు అనంతరం అమ్మవారిని శాకాంబరిమాతగా అలంకరించారు.అనంతరం సుహాసినిలు కుంకుమార్చనలు చేశారు.మధ్యాహ్నం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.