ఎల్లారెడ్డి, ఆగస్టు 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డు లో గల పట్టణ ప్రకృతి వనంలో, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ వనంలో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధుని విగ్రహాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ నునుగొండ భూదేవి శ్రీనివాస్ తో కలిసి ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు కొట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రకృతి వనం చెట్లతో సుందరంగా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఉండటం పట్ల వార్డు కౌన్సిలర్ ను ఎమ్మెల్యే అభినందించారు. సుందర వనంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత కీర్తి శేషులు నునుగొండ వెంకటయ్య జ్ఞాపకార్థం ఆయన కూతురు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా 2017 లో రాష్ట్రపతి అవార్డు అందుకున్న నునుగొండ విజయలక్ష్మి చే ఏర్పాటు చేయించిన గౌతమబుద్ధుని విగ్రహం చూపరులను అమితంగా ఆకర్షించే విధంగా ఉందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రకృతి వనం అభివృద్ధికీ పలు సూచనలు చేశారు. గౌతమ బుద్ధుని బోధనలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ వెంట స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కమీషనర్ జగ్జీవన్, జడ్పీటిసి ఉషా గౌడ్, గాంధారి ఏఎంసి చైర్మన్ సత్యం రావు, సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎడ్ల కిషన్, కౌన్సిలర్లు నునుగొండ భూదేవి, నీలకంఠం, అల్లం శ్రీను, భుంగారి రాము, బిఆర్ఎస్ పార్టీ మండల,పట్టణ అధ్యక్షులు జెలందర్ రెడ్డి, ఆదిమూలం సతీష్, గాంధారి మాజీ జడ్పీటిసి తానాజి రావు, ప్రముఖ వ్యాపార వేత్త కంచర్ల బాలకిషన్, విశ్రాంత ఉద్యోగులు ఎంసాని సుధాకర్, పటేల్ నర్సింహారావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నునుగొండ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, బాల్ రాజ్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, సంగని పోచయ్య, గాదె తిరుపతి , పాపయ్య, గాదె సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.