జడ్చర్ల, అక్టోబర్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో )ప్రతి జర్నలిస్ట్ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఇప్పటికే 50శాతం టీజేఏ జర్నలిస్ట్ లకు యూనియన్ నిధులతో పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించామని
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు, టీజేఏ ఫౌండర్, ఎన్ యుజే(ఐ)మాజీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ)రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ, జిల్లాల వారిగా, మండలాల వారిగా కూడా టీజేఏ జర్నలిస్ట్ లకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయియించే ఏర్పాటు చేస్తాం అన్నారు. జిల్లాల్లో అన్ని అర్హతలు ఉంది అక్రిడిటేషన్ రాని వారికి అధికారులతో మాట్లాడుతూ, అక్రిడిటేషన్ లు ఇప్పించమన్నారు.
జైపూర్ లో ఇటీవల జరిగిన ఎన్ యుజె(ఐ) జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఇద్దరు కేంద్ర మంత్రులకు జర్నలిస్ట్ ల రైల్వే రాయితీ పాస్ ల గురించి వినతిపత్రం అందించడం జరిగిందని ఎన్ యుజె (ఐ)సెక్రటరీ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 90మంది ఎంపికైన జర్నలిస్టులు హాజరయ్యారన్నారు. జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులను ప్రతి జిల్లాలో జర్నలిస్టులు ఖండించాలన్నారు.
అనంతరం టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణ రావు మాట్లాడుతూ, జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం టీజేఏ పని చేస్తుందని, జిల్లాలో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు కోసం పోరాటం చేస్తాం అన్నారు. తెలంగాణలోని టీజేఏ జర్నలిస్టులు అందరికి యూనియన్ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే 60శాతం జర్నలిస్టులకు టీజేఏ యూనియన్ గుర్తింపు కార్డులు అందించామన్నారు. ఎన్ యుజె( ఐ) సభ్యుడు రామ్మోహన్ మాట్లాడుతూ, జర్నలిస్ట్ పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలని అన్నారు. ప్రతి అక్రిడిటేషన్ కల్పించిన జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. టీజేఏ ఉపాధ్యక్షుడు ఖసీం మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో యునియాన్ సభ్యత్వాలు పెంచాలన్నారు. ఢిల్లీ లో జర్నలిస్ట్ లపై జరిగిన దాడులను ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా తీర్మానాన్ని, ఎన్ యు జే(ఐ)సభ్యురాలు ప్రతిపాదించారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలని తీర్మానం ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజేఏ కు అక్రిడిటేషన్ కమిటీలో సభ్యత్వం కల్పించాలని ఖమ్మం జిల్లా టీజేఏ అధ్యక్షులు నాగస్వామి ప్రతిపాదించారు. 3ప్రతి పాదనలు సమావేశంలో తీర్మానించారు.
ఈ సమావేశంలో టిజేఏ కోశాధికారి ఖలీల్, టీజేఏ రాష్ట్ర కార్యదర్శి సంపత్, మాజీ అధ్యక్షులు మోహన్ యాదవ్, టీజేఏ ప్రతినిధి యాధిలాల్, నిజామాబాద్ జిల్లా టీజేఏ అధ్యక్షుడు రమేష్ రావన్, నల్గొండ జిల్లా టీజేఏ అధ్యక్షులు వాసు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు యాదిలాల్ వివిధ జిల్లాల నుండి వచ్చిన టీజేఏ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.