చేగుంట, ఏప్రిల్ 23:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఈనెల 25న దుబ్బాకలో నిర్వహించే టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని చేగుంట బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడెం వెంగళరావు ఆదివారం తెలిపారు. ఈనెల 25న చేగుంట మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉదయం 9 గంటలకు టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, స్థానిక సర్పంచులు, ఎంపిటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని టిఆర్ఎస్ జండాను పండగ వాతావరణం లో ఎగురవేసి మండల కేంద్రమైన చేగుంట గాంధీ చౌరస్తాకు చేరుకొని దుబ్బాక లో జరిగే టిఆర్ఎస్ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని వెంగళరావు కోరారు.