Home Epaper మద్నూర్ లో  చర్చాంశనీయంగా మారిన బి ఆర్ ఎస్ నేత పనితీరు

మద్నూర్ లో  చర్చాంశనీయంగా మారిన బి ఆర్ ఎస్ నేత పనితీరు

by V.Rajendernath

రిపోర్టర్ సంగప్ప

మద్నూర్, ఏప్రిల్  24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )జుక్కల్  నియోజకవర్గంలోని మద్నూర్ కు చెందిన  ఓ సీనియర్ బి ఆర్ ఎస్ నాయకుడి  వ్యవహారం గులాబీ శ్రేణులలో చర్చ నీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి పార్టీలో క్రియా షీలకంగా వుంటూ,  పదవులు అనుభవిస్తూ, చివరకు ఎమ్యెల్యే కు కొరకరని కొయ్యగా మారాడు.  ఆయన ఇటీవల కాలం నుండి పార్టీ కార్యక్రమాల పట్ల అలాగే ప్రభుత్వ పరంగా సాగే కార్యక్రమంలో మౌనంగా ఉంటున్నారు. నియోజిక వర్గంలో ఎమ్మెల్యే కు పెరుగుతున్న ఆదరణ లో తన పేరుతో  ఎదిగిన స్వంత పార్టీ నాయకులు పార్టీ కోసం అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే కు పని చెయ్యాల్సిన వారే వేరే కుంపటి కి ప్రయత్నం చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇక్కడ చర్చనీయంగా మారింది. కార్యకర్తలకు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు  దారి చూపిస్తూ అన్ని విధాలుగా నియాజిక వర్గ అభివృద్ధి కి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హన్మంత్ షిండే కె మచ్చ పెట్టె యోచనలో ఆ నేత పావులు కదుపుతున్నారు.  ఈ నేత చర్యలపై  పరోక్షంగానో, ప్రత్యక్షంగానో తెలియజేసిన్నప్పటికి ఎమ్యెల్యే ఆ నేతకు  పెద్ద పిటా వేస్తుంటే, అతను ఎమ్యెల్యేకు గోతులు తీయడం ప్రారంభించారని జుక్కల్ సెగ్మెంట్ లో చర్చగా మారింది.  ఎమ్మెల్యే కే  చుక్కలు చూపే విదంగా వ్యవహారాలు చేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు అని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కులాల మధ్య,  అన్నదమ్ముల మధ్య కార్యకర్తల మధ్య కోట్లాటలు వర్గ విబేధాలు సృష్టించడoలో  ఆ నేత శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. .మద్నూర్ మండలంలో గత 15 ఏళ్ల నుండి నేతకు  సర్వ అధికారులు అప్పజెప్పి తప్పు చేసారని సీనియర్ నాయకులు బహిరంగ చెప్పుకుంటున్నారు.   కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యే కు మించి మరికొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే తర్వాత సర్వం తానే అన్న చందంగా వ్యవహరించి గులాబీ పార్టీలో క్రింది స్థాయి కార్యకర్తల నుండి విమర్శలు  ప్రతి గ్రామంలో వర్గ విబేధాలు ఒకర్ని లేపడం మరొక్కర్ని దించడం చేసి పలు ఆరోపణలు విమర్శలు సైతం ఎదుర్కొన్నారు.  ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజ్ పైనే ఉండి హల్చల్ చేస్తూ మైక్ చేతిలో పట్టుకొని చెక్ ల పంపిణీ అలాగే స్థానిక అధికారులకు గుప్పెట్లో పెట్టుకొని సర్వం తానే వ్యవహరించి అన్ని గ్రామాల్లో గ్రూప్ తగాదాలు సృష్టించి బాధనం అయిన వ్యక్తి ఆ నేతఅని జగ మెరిగిన సత్యం.  పలు విషయాలలో ఆయన తనదే నడవాలనే సిద్ధాంతం అవలంబించడంతో చిత్తశుద్ధిగా పనిచేసే కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ మిస్మయాన్ని వ్యక్తపరిచారు. పలు విషయాలలో వివాదాస్పరంగా మారిన ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే షిండే సిద్ధంగా ఉన్నారని తెలిసిన ఆ నేత  వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు మద్నూర్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవులు  ఇవ్వవద్దని పరోక్షంగా ఎమ్మెల్యేకు ముక్తకంఠంతో తెలియజేశారు. అయినప్పటికీ స్థానిక శాసనసభ్యుడు ఆశీర్వాదంతో  ఓ నామినేటెడ్ పదవి చేజిక్కించుకున్నాడు.  మార్కెట్ బంద్ వ్యాపారస్తులుఆ నేతకు పదవి వద్దంటూ  స్వచ్ఛందంగా బంద్ పాటించి పార్టీ నేతలు, కార్యకర్తలు  నిరసన తెలిపడం గమనార్హం. ఆ రోజు ఎమ్మెల్యే కూడా హాజరు కాలేక పోవడం పట్ల చర్చనీయంగా మారింది.

కానీ ఇటీవల కాలం నుండి ఆయన స్తబ్దంగా ఉండడం ఇక్కడ జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉండటంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలో పాల్గొనక పోవడం పవిత్ర రాంజాన్ పండుగ సందర్భంగా ఇస్తున్న విందులో రాకపోవడం, ఆయన తీరు  పట్ల సర్వత్ర గులాబీ శ్రేణులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  మద్నూర్, జుక్కల్, డోoగ్లీ మండలంలో జరిగిన పార్టీ బలం పెంపు అలాగే ఆత్మీయంగా ఒకరి కష్ట సుఖాలు తెలుసుకొని వర్గ విబేధాలు లేకుండా పార్టీ కోసం అందరు కల్సి కట్టుగా కృషి చేయాలని ఎమ్యెల్యే  ఎంతో కష్టం పడుతుంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని సర్వం హాలచల్ చేసుకొని ఇప్పుడు

ఆయన మౌనంగా ఉండడం వెనుక మతలబు ఏమిటి అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే నే ఆయనను దూరం పెట్టారా లేక పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా అన్న చర్చలు ఉన్నాయి.  ఆయన మౌనం ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గం లోని గులాబీ పార్టీలో అందరి నోటా చర్చనీయంశంగా మారింది. పార్టీ కి దూరంగా ఉంటూ  పర్సనల్ లైఫ్ లో ఎంజాయ్ చేసుకుంటున్నారని కొందరు నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.  పార్టీ మార్చే విషయంలో కార్యకర్తల నుండి అంతగా స్పందన రాకపోవడంతో ఆ నేత మౌనం వహిస్తున్నట్లు వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేత తీరుపై ఎమ్యెల్యే స్పందన ముందు ముందు ఎలా ఉంటుందన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

You may also like

Leave a Comment