35
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ. నీలకంటేశ్వరాలయంలో 890వ బసవ జయంతి పూజలు వీరాశివలింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సమాజ్ నేతలు నీలకంఠునికి జలాభిషేకలు, పాలభిషేకలు నిర్వహించారు. అనంతరం బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు వీరప్ప, నాయికోటిరవి అప్ప, సంఘప్ప, నీలకంఠం అప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు.