Home Epaper ముస్లింలకు రంజాన్ తోఫాల పంపిణీ.

ముస్లింలకు రంజాన్ తోఫాల పంపిణీ.

by V.Rajendernath

బీబీపేట్ ఏప్రిల్ 18 :- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) బీబీపేట్ మండల కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక జమ్మ మజీద్ లో ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద ముస్లింలకు మంగళవారం రంజాన్ తఫాలను జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ ,డి .సి .ఎం .ఎస్ వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి ,స్థానిక ఎంపీపీ బాలమని అందజేశారు .ఈ సందర్భంగా స్థానిక కో ఆప్షన్ సభ్యులు ఆసీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి లో భాగంగా రంజాన్ పండగకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ మైనార్టీలకు బట్టలు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తేలులక్ష్మి సత్యనారాయణ ,వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి ఎంపీటీసీ లు లక్కర్స్ రవి దుంప పల్లవి భూమేష్ ,ఏ ఎం. సి .డైరెక్టర్ ఆది రాజయ్య బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బత్తిని జనార్దన్ మైనార్టీ నాయకులు గౌస్ ,రషీద్ ,అఫ్జల్ హజీ ,యూసుఫ్ ,తదితరులు పాల్గొన్నారు .

You may also like

Leave a Comment